రోడ్డు పనుల వివాదం: వ్యక్తిపై దాడి, కేసు నమోదు

1020చూసినవారు
రోడ్డు పనుల వివాదం: వ్యక్తిపై దాడి, కేసు నమోదు
మాచవరం మండలం పిల్లుట్ల గ్రామంలో సిమెంట్ రోడ్డు పక్కన కాలువల నిర్మాణంపై వివాదం తలెత్తింది. కాలువ వెడల్పు తగ్గించాలని కోరిన అంగడి శ్రీనివాసరావుపై కండెల రత్నబాబు రాయితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ పవన్ కుమార్ ఈ వివరాలను వెల్లడించారు.

సంబంధిత పోస్ట్