మంగళగిరిలోని నులకపేటలో దీర్ఘకాలంగా ఉన్న మురుగునీటి సమస్య పరిష్కారానికి మంత్రి లోకేశ్ రూ. 26 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో చేపట్టనున్న పక్కా డ్రైనేజీ నిర్మాణ పనులకు బుధవారం టీడీపీ నేతలు భూమిపూజ చేశారు. మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణ టీడీపీ అధ్యక్షుడు వెంకట్రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు.