వైసీపీ ప్రభుత్వ హయాంలో దేవాలయాల పవిత్రతను దెబ్బతీశారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ తీవ్రంగా మండిపడ్డారు. గురువారం గుంటూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడటం క్షమించరాని నేరమని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తప్పు చేయలేదని భావిస్తే, తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రమాణం చేయాలని నసీర్ సవాల్ విసిరారు.