రెవెన్యూ సేవల్లో సంతృప్తి పెంచాలి: కలెక్టర్ ఆదేశం

527చూసినవారు
రెవెన్యూ సేవల్లో సంతృప్తి పెంచాలి: కలెక్టర్ ఆదేశం
ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా రెవెన్యూ సేవలపై ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రెవెన్యూ అధికారుల వర్క్ షాప్‌లో ఆమె మాట్లాడుతూ, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం తాజాగా అనేక సర్క్యులర్లను జారీ చేసిందని గుర్తుచేశారు. ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడంలో అధికారులు చొరవ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీవాస్తవతో పాటు పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్