అబ్బరాజుపాలెం గ్రామంలో నూతన వెరైటీ స్టార్ లైన్ మిరప పంట క్షేత్ర ప్రదర్శన

1368చూసినవారు
రవి హైబ్రిడ్ సీడ్స్ వారి నూతన వెరైటీ స్టార్ లైన్ మిరప పంట క్షేత్ర ప్రదర్శన బుధవారం పెదకూరపాడు మండలం అబ్బరాజుపాలెం గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా కంపెనీ సేల్స్ ఆఫీసర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ, స్టార్ లైన్ సంకరజాతి విత్తనం వైరస్, బొబ్బరిని తట్టుకునే శక్తి కలిగి ఉందని, ఎకరాకు 30 నుండి 40 క్వింటాన్ల దిగుబడి పొందవచ్చని తెలిపారు. చివరి కొమ్మ వరకు కాయలు ఉండడం ఈ విత్తనానికి ప్రత్యేకత అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు, అమరావతి, సత్తెనపల్లి మండలాల నుండి పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్