తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం: ఎర్రబాలెంలో నూతన జెండా ఆవిష్కరణ

605చూసినవారు
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం: ఎర్రబాలెంలో నూతన జెండా ఆవిష్కరణ
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో, తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆదేశాల మేరకు, ఎర్రబాలెంలో పార్టీ నూతన జెండాను టీడీపీ నాయకులు ఏపూరి లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీ రామారావు పార్టీని స్థాపించారని, ఆయన ఆశయాలను చంద్రబాబు, లోకేష్ ముందుకు తీసుకెళ్తున్నారని తెలుగు యువత సెక్రటరీ కుంభ గోపి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్