శ్రీమల్లేశ్వరస్వామి దేవస్థానం ముఖద్వారం నిర్మాణానికి స్వంత నిధుల నుండి రూ. 60 లక్షలు విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చిన తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామానికి చెందిన తేనెటి మహేష్ రెడ్డిని ధూళిపాళ్ళ నరేంద్ర శాలువాతో గురువారం సత్కరించి అభినందించారు. దేవస్థానం అభివృద్ధికి దాతృత్వంతో ముందుకు రావడం అభినందనీయం అని, ఇలాంటి దాతలు మరింతగా ముందుకు వచ్చి దేవాలయాల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.