భక్తిశ్రద్ధల మధ్య సాధుసంత్ సమాగమన మహోత్సవం

1087చూసినవారు
భక్తిశ్రద్ధల మధ్య సాధుసంత్ సమాగమన మహోత్సవం
పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని శ్రీ శ్రీ రాధా గోవింద మందిరం ఆధ్వర్యంలో గురువారం విశాల భారత సాధు సంత్ సమాగమన మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఈ మహోత్సవంలో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక చైతన్యం పంచుతున్న భాగవత ధర్మ సమాజ్ సంస్థాపకాచార్యులు అనంత శ్రీ విభూషిత జగద్గురు శ్రీ కృష్ణ చైతన్య స్వామి వారు భక్తులకు దివ్య ఆశీస్సులు అందజేశారు. పొన్నూరు ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ తన ధర్మపత్ని జ్యోతర్మయి తో కలిసి మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమం భక్తిమయ వాతావరణంలో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్