తిరుపతి లడ్డుపై కూటమి ప్రభుత్వం చేసిన అసత్య ప్రచారంపై వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శనివారం పొన్నూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పార్టీ శ్రేణులతో కలిసి పూజలు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డుపై అసత్య ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నీచ రాజకీయాలు మానుకొని ప్రజా పరిపాలన చేయాలని కూటమి ప్రభుత్వానికి అంబటి సూచించారు.