పొన్నూరు మున్సిపల్ పరిధిలో ఒక బార్ లైసెన్స్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ రమేష్ బుధవారం తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు రూ. 5 లక్షల నాన్ రిఫండబుల్ ఫీజు, రూ. 10 వేల ప్రాసెస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు దరఖాస్తులు వస్తేనే వేలం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 4వ తేదీ లోపు స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తులను అందజేయాలని సీఐ రమేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.