పల్స్ పోలియో కార్యక్రమంలో కమిషనర్ రమేష్ బాబు

4086చూసినవారు
పల్స్ పోలియో కార్యక్రమంలో కమిషనర్ రమేష్ బాబు
పొన్నూరు పురపాలక సంఘ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పోలియో బూత్ లను సందర్శించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ సిబ్బంది, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్