పొన్నూరు మండలం గొళ్ళమూడిపాడు, దండమూడి గ్రామాలలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం జరిగింది. మండల ఏవో ఆర్ వెంకటేశ్వరరావు పాల్గొని, అపరాలు, తెల్ల జొన్న, మొక్కజొన్న పైర్లలో సస్య రక్షణ చర్యలు, ఎరువుల యాజమాన్యం గురించి రైతులకు వివరించారు. అపరాల పైర్లలో తొలి దశలో, 30-35 రోజుల వయసులో తేలికపాటి తడి ఇచ్చి, కలుపు నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. 30 రోజుల దశలో తెల్ల దోమ నివారణకు ఎకరాకు 60 గ్రాముల అసీటీమఫ్రిడ్ లేదా 300 మి.లీ పిఫ్రోనిల్ పిచికారి చేయాలని సూచనలు అందించారు.