శనివారం పెదకాకాని మండలం పెదకాకాని, వెనిగండ్ల గ్రామాలలో ఏపీ వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలాని సుమున్ ఆకస్మికంగా పర్యటించారు. రైతులు తమ మొబైల్ ఫోన్లలో ఏపీ ఎయిమ్స్ యాప్ ను స్వయంగా రిజిస్ట్రేషన్ చేసుకుని, దాని ఉపయోగాలను తెలుసుకునేలా ఆయన వివరించారు. బోయపాటి రమేష్ పొలంలో ఒక రైతు ద్వారానే పంట నమోదు చేయించి, ఈ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎడి నాగేశ్వరరావు, ఏ డి ఏ మోహన్ రావు పాల్గొన్నారు.