రైతులకు APAIMS 2.0 యాప్‌పై అవగాహన: కలెక్టర్ సూచనలు

4429చూసినవారు
రైతులకు APAIMS 2.0 యాప్‌పై అవగాహన: కలెక్టర్ సూచనలు
గుంటూరు జిల్లా, పొన్నూరు నియోజకవర్గంలోని తక్కెలపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు APAIMS 2.0 యాప్‌పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ మాట్లాడుతూ, రైతులు శాస్త్రవేత్తల సూచనల మేరకు అవసరమైన మేరకే ఎరువులు వాడాలని, సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ఎరువుల కేటాయింపును పెంచాలని రైతులు కోరగా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్