మసీదుల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలి

480చూసినవారు
మసీదుల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలి
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని మసీదులు, ఖబర్స్తాన్ ల వద్ద పారిశుధ్యం, విద్యుత్ దీపాలు వంటి మౌలిక వసతులు కల్పించాలని పట్టణ ముస్లిం మత పెద్దలు కోరారు. శనివారం మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబుకు వినతిపత్రం అందజేశారు. వచ్చే నెల 3వ తేదీన షబ్-ఏ-బరాత్ పండుగ సందర్భంగా ఈ వసతులు కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ రమేష్ బాబు మత పెద్దలకు హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్