పెదకాకానిలో కరీముల్లా బాబా 17వ ఉరుసు మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం

330చూసినవారు
పెదకాకానిలో కరీముల్లా బాబా 17వ ఉరుసు మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం
గుంటూరు జిల్లా పెదకాకానిలోని హజరత్ సయ్యద్ కరిముల్లా షా ఖదరి (కాలేషా పీర్ మస్తాన్ వలి) దర్గా వద్ద 17వ ఉరుసు గంధ మహోత్సవాలు రేపటి నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. జూన్ 13న కంబల్ ఫాతెహ, 14న గంధం, 15న దీపారాధన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దర్గా చైర్మన్ పఠాన్ మహబూబ్ సుభాని తెలిపారు. మూడు రోజుల పాటు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు, ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి అమావాస్యనాడు కూడా దర్గాలో అన్నదానం నిర్వహిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్