శివరాత్రి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే దూళిపాళ్ల

593చూసినవారు
శివరాత్రి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే దూళిపాళ్ల
గుంటూరు జిల్లా, పొన్నూరు నియోజకవర్గం, పెదకాకానిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సామాన్య భక్తులే ముఖ్యమని పేర్కొంటూ, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ తదితర సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్