గురువారం పెదకాకాని మండలం ఉప్పలపాడు పక్షుల కేంద్రాన్ని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ జిల్లా అటవీ శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ కేంద్రం దేశ విదేశాల నుంచి వలస వచ్చే అనేక రకాల పక్షులకు ఆశ్రయంగా ఉందని, ముఖ్యంగా వివిధ జాతుల కొంగలు, అరుదైన వలస పక్షులు రావడంతో ఇది పర్యాటక ప్రాంతంగా ప్రాధాన్యం సంతరించుకుందని తెలిపారు. పక్షులకు కల్పిస్తున్న వసతులు, అధికార అంశాలను ఆయన అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.