పెదకాకాని మండల కేంద్రంలోని పెద్దకాకాని గ్రామంలో గల భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లను ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మండల పార్టీ అధ్యక్షులు వలివేటి మురళీకృష్ణ, ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్‌తో కలిసి ఏర్పాట్లను సమీక్షించి, తగు జాగ్రత్త చర్యలు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.