పొన్నూరు: యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

210చూసినవారు
పొన్నూరు: యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
అమరావతిలో జరిగిన అవగాహన సదస్సులో మంత్రి సవిత మాట్లాడుతూ, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా ఉపాధి అవకాశాలు పెంచుతూ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు సబ్సిడీ రుణాలు, శిక్షణ, మార్గదర్శకత్వం అందిస్తున్నట్లు తెలిపారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, యువత ఉద్యోగాలు వెతకడం కాకుండా కల్పించే స్థాయికి ఎదగాలని, మహిళలు కూడా పరిశ్రమల్లో ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్