నంబూరులో సాధు సంత్ సమాగమన మహోత్సవాలు

829చూసినవారు
పెదకాకాని మండలం నంబూరులోని శ్రీ రాధా గోవింద మందిరంలో 'విశాల భారత సాధు సంత్ సమాగమన మహోత్సవాలు' వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో గురువారం ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ పాల్గొని, భాగవత ధర్మ సమాజ్ సంస్థాపకులు శ్రీపాద కృష్ణబలరామ స్వామీజీ మహారాజ్ ప్రభుపాదను దర్శించుకున్నారు. జగద్గురు స్వామీజీ నుంచి ఆయన ప్రత్యేక ఆశీస్సులు అందుకున్నారు. దేశవ్యాప్తంగా వచ్చిన సాధువుల రాకతో నంబూరు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ మహోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి.

సంబంధిత పోస్ట్