చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా వందన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మైలా వెంకటరామరాజు, ప్రధాన కార్యదర్శి అనంతలక్ష్మీనారాయణ, సర్పంచ్ వెలగా సాంబశివరావు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు వెలగా పవన్ కుమార్ తో పాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.