వచ్చే నెలలో నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ తహసిల్దార్

252చూసినవారు
వచ్చే నెలలో నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ తహసిల్దార్
పొన్నూరు మండలంలో రీ సర్వే పూర్తయిన గ్రామాలలో శాశ్వత పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు ఫిబ్రవరి మాసంలో శ్రీకారం చుట్టినట్లు మండల తహసీల్దార్ మహమ్మద్ జియావుల్ హక్ తెలిపారు. మొదటి విడతగా దండమూడి, పచ్చలతాటిపర్రు గ్రామాలలో రీ సర్వే పూర్తయిందని, వచ్చే నెల 2వ తేదీన దండమూడి గ్రామ సచివాలయంలో నూతన పాసు పుస్తకాలను అందజేస్తామని చెప్పారు. దండమూడి గ్రామంలో 796 పుస్తకాలకు గాను 681 మందికి పాస్ పుస్తకాలు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్