తెలుగుదేశం పార్టీ 44వ వసంతంలోకి: చేబ్రోలులో ఘనంగా వేడుకలు

300చూసినవారు
తెలుగుదేశం పార్టీ 44వ వసంతంలోకి: చేబ్రోలులో ఘనంగా వేడుకలు
తెలుగుదేశం పార్టీ 44వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా చేబ్రోలు మండలంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆదేశాల మేరకు చేబ్రోలు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జెండా వందన కార్యక్రమం జరిగింది. అనంతరం, చేబ్రోలు సెంటర్‌లో ఉన్న పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మైలా వెంకట రామరాజు, ప్రధాన కార్యదర్శి అనంత లక్ష్మి నారాయణతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్