మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నం కూటమి ప్రభుత్వం పథకం ప్రకారమే చేసిందని పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. గురువారం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరుపతి లడ్డు విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు నిజాలు తేల్చి చెప్పాయని, రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు పెట్టి వైసిపిని అప్రతిష్టపాలు చేయడానికి కూటమి ప్రభుత్వం కుతంత్రాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి శ్రేణులు పాల్గొన్నారు.