గుంటూరులో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ, వైసీపీ పాలనలోనే నిజమైన జంగిల్ రాజ్ జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు మాచర్లకు వెళ్తే తాళ్లు కట్టారని, టీడీపీ ఆఫీస్‌పై దాడులను జగన్ సమర్థించారని విమర్శించారు. మైనార్టీల సమస్యలను వైసీపీ పట్టించుకోలేదని, కల్తీ నెయ్యి విషయంలో దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. సిట్ రిపోర్ట్‌లో యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టు ఉందని, టీటీడీ నిబంధనలు వైసీపీ హయాంలోనే మార్చారని, 2019-23 నెయ్యి టెండర్లు వైసీపీ ప్రభుత్వమే ఇచ్చిందని, దీనితో భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశారని అన్నారు. దేశవ్యాప్తంగా హిందువులకు వైసీపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిట్ విచారణ ఫైనాన్షియల్ ట్రయల్ వరకే పరిమితమని, లోతైన విచారణ చేస్తే అసలు బాధ్యులు బయటపడతారని పేర్కొన్నారు.