పొన్నూరు పట్టణానికి చెందిన సత్యాగ్రహం దినపత్రిక రిపోర్టర్ సయ్యద్ జైనుల్లాద్దీన్ పెద్ద కుమారుడు సయ్యద్ షకిల్ గత రాత్రి అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న పొన్నూరు నియోజకవర్గ
వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి బా
ధిత కుటుంబ సభ్యులను వారి నివాసంలో పరామర్శించి, ఓదార్చారు. షకిల్ మృతి పట్ల స్థానిక పాత్రికేయులు, పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.