ఇప్పటికైనా నీచ రాజకీయాలు మానుకోవాలి వైసీపీ నేత అంబటి

620చూసినవారు
పొన్నూరు వైసిపి నేత అంబటి మురళీకృష్ణ శనివారం పొన్నూరులో మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడుకోవటం చంద్రబాబు ప్రభుత్వానికే సాధ్యమని విమర్శించారు. తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, కూటమి నేతలు చేసిన నీచమైన విష ప్రచారాన్ని సిబిఐ తప్పు పట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ విష ప్రచారంపై తాము ఉద్యమిస్తే ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తప్పుడు కేసులు పెట్టారని గుర్తు చేశారు. సిబిఐ చార్జిషీట్ చంద్రబాబుకు చెంపపెట్ట అని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్