విష గుళికలు తిని 30 గొర్రెలు మృత్యువాత

1628చూసినవారు
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పరు గ్రామానికి చెందిన నక్క శ్రీనివాసరావు, కొమ్మనబోయిన హరిబాబులకు చెందిన 30 గొర్రెలు ఎడ్లపాడు మండలం కారసాలగ్రామంలో మృతి చెందాయి. ఒక రైతు పత్తి పైరు ఈడు పోవడంతో, దానిని కొనుగోలు చేసి గొర్రెలను మేపుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పక్కనే ఉన్న దుక్కిలో జొన్న విత్తనాలతో పాటు విష గుళికలు ఉండటంతో, వాటిని తిన్న గొర్రెలు అక్కడికక్కడే మరణించాయి. దీంతో రైతులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయి, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్