విష గుళికలు తిని 30 గొర్రెలు మృత్యువాత

2917చూసినవారు
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని కొప్పరు గ్రామానికి చెందిన నక్క శ్రీనివాసరావు, కొమ్మనబోయిన హరిబాబులకు చెందిన 30 గొర్రెలు ఎడ్లపాడు మండలం కారసాలగ్రామంలో మృతి చెందాయి. రైతు తన పత్తి పైరు ఈడు పోవడంతో, దాని స్థానంలో వేసిన జొన్న విత్తనాలతో పాటు ఉన్న విషపు గుళికలను గొర్రెలు తిన్నాయి. దీంతో అక్కడికక్కడే అవి మరణించాయి. బాధితులైన రైతులు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కన్నీరుమున్నీరవుతున్నారు.

సంబంధిత పోస్ట్