శుక్రవారం పల్నాడు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు సమీపంలోని సూపర్ కాటన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్, ఆటో ఢీకొనడంతో కొమ్మూరు గ్రామానికి చెందిన జొన్నలగడ్డ నాగరాజు (25) తీవ్రంగా గాయపడ్డాడు. అతని కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి కూడా గాయపడ్డాడు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.