ప్రత్తిపాడు బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన
టీడీపీ చలివేంద్రం ఫ్లెక్సీలు ధ్వంసం కావడంతో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనకు ధర్నాకు వచ్చిన
వైసీపీ నేతలే కారణమని
టీడీపీ నాయకులు ఆరోపించారు. దీనికి నిరసనగా
టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఇరు వర్గాలను సముదాయించారు. పరిస్థితి అదుపులో ఉండేందుకు చలివేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.