ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బాత్ ఎమ్మెల్యే బూర్ల

627చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బాత్ ఎమ్మెల్యే బూర్ల
ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకు సమర్పించగా, ఆయన వాటిని పరిశీలించి తక్షణ పరిష్కారాలు చూపించారు. మరికొన్ని సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించి, త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికే ఈ దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్