ప్రత్తిపాడు: పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే

690చూసినవారు
ప్రత్తిపాడు: పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే
ప్రత్తిపాడులో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలిరోజే పెన్షన్ల పెంపుపై సంతకం చేశారని కొనియాడారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో 31,677 మందికి రూ. 13.60 కోట్ల పెన్షన్లు వివిధ కేటగిరీలలో అందజేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్