ప్రత్తిపాడు మండల వ్యవసాయ కార్యాలయంలో బుధవారం ఎరువుల డీలర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో, జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకులు యన్. మోహన్‌రావు లైసెన్స్, స్టాక్ వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని, ప్రతి విక్రయాన్ని ఈ-పాస్ ద్వారా చేసి రైతులకు బిల్లు ఇవ్వాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు మండలాల డీలర్లు పాల్గొన్నారు.