ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి పెమసాని

519చూసినవారు
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పరు గ్రామంలో శనివారం కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుతో కలిసి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. కొప్పరు ప్రాంతంలోని రైతులకు సాగునీటి అవసరాలు తీర్చేందుకు ఈ పథకాన్ని పునః ప్రారంభించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో మండలంలో సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడ్డారని, ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు కోరిక మేరకు ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్