వైసీపీ నేత అంబటి రాంబాబుకు సినిమా చూపిస్తాం కేంద్ర మంత్రి

1406చూసినవారు
గుంటూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబుకు కూటమి ప్రభుత్వం త్వరలో సినిమా చూపిస్తుందని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమసాని చంద్రశేఖర్ అన్నారు. శనివారం పెదనందిపాడు మండలం కొప్పరు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని అనంతరం ఏర్పాటుచేసిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుపై అంబటి అనుచిత వ్యాఖ్యలు చేయటంపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరికైనా సినిమా చూపిస్తామని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్