రేపల్లె–పెనుమూడి రోడ్డుపై ఘోర ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

4546చూసినవారు
రేపల్లె–పెనుమూడి ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం హిరాల గ్రామానికి చెందిన బాపనయ్య తన భార్య, కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన మరో వాహనం ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బాపనయ్యతో పాటు మరో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయారు. బాపనయ్య భార్య, కుమారుడు గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన మరో యువకుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్