
సత్తెనపల్లి: బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. రిమాండ్ కు తరలింపు
సత్తెనపల్లిలో వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి, ఆమె కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక ఫిర్యాదుతో మహిళా పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు విచారణ జరిపి, ఆరోపణలు స్పష్టమవడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, కోర్టు అతనికి రిమాండ్ విధించింది.





































