పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం బెల్లంకొండ అడ్డరోడ్డులో వెలసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక మాసంలో 100 మందికి పైగా భక్తులు ఆంజనేయ స్వామి మాల ధరించారని గుడి పూజారి అనంత చార్యులు తెలిపారు. డిసెంబర్ 3న ఆంజనేయ స్వామి జయంతి రోజున దీక్ష పూర్తి చేసుకొని, ఇడిమూడితో స్వాములు అందరూ వస్తారని ఆయన పేర్కొన్నారు.