వర్షంతో జలమయమైన డొంక రోడ్డు.. ఇబ్బందుల్లో సత్తెనపల్లి వాసులు

1530చూసినవారు
సత్తెనపల్లి పట్టణంలోని సుందరయ్య కాలనీ, శాలివాహన నగర్ మధ్య ఉన్న దేవర్లపాడు డొంక రోడ్డు శనివారం తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి జలమయమైంది. రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీటి నిల్వల కారణంగా విషపురుగులు ఇళ్లలోకి ప్రవేశించి ప్రజలను కుట్టే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్