సత్తెనపల్లి-పెదకూరపాడు రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 35-40 ఏళ్ల వయసున్న మృతుడు నలుపు రంగు టీ-షర్ట్ ధరించి ఉన్నాడు. అతని ముక్కు, తలపై గాయాలున్నాయి. మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మోర్చరీలో ఉంచారు. వివరాలు తెలిసినవారు నడికుడి GRP పోలీసుల నెంబర్ 9849123990, 9440373372 కు సంప్రదించాలని కోరారు.