క్రోసూరు మండలం హసానాబాద్ గ్రామానికి చెందిన 11 ఏళ్ల షేక్ ఖలీల్ హత్య కేసులో ముగ్గురు పిల్లలను అరెస్టు చేసి, గుంటూరు బాలనేరస్థుల కోర్టులో హాజరుపరిచినట్లు క్రోసూరు ఎస్సై రవిబాబు తెలిపారు. ఈ నెల 4వ తేదీన తోటి పిల్లలతో గొడవలున్న ఖలీల్‌ను నీటి కుంట వద్దకు పిలిచి, కత్తితో దాడి చేసి, కర్రతో తలపై కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని నీటి కుంటలో పడేశారు. నిందితులను విజయవాడ బాలనేరస్థుల ఆశ్రమానికి తరలించారు. సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు జరిగింది.