అమరావతిలోని లింగాపురంలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. తలపై రాయితో కొట్టి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలు పిడుగురాళ్లకు చెందిన యువతి అని సీఐ అచ్చయ్య తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అమరావతి మార్చురీకి తరలించారు.