లడ్డు వివాదంపై కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్: సుధీర్

657చూసినవారు
లడ్డు వివాదంపై కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్: సుధీర్
తిరుమల లడ్డూ వివాదంపై కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆదివారం సత్తెనపల్లి వైసీపీ ఇంఛార్జ్ సుధీర్ భార్గవ్ మండిపడ్డారు. సత్తెనపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ల్యాబ్ రిపోర్టుల్లో జంతువుల కొవ్వు కలిసినట్లు ఎక్కడా రుజువు కాలేదని, సుప్రీంకోర్టు వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్