ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై వైసీపీ మహిళా నాయకులు ఫిర్యాదు

994చూసినవారు
సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి, వైసీపీ మహిళా నాయకులతో కలిసి గురువారం సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ తన ఏబీఎన్ ఛానల్‌లో చేసిన వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని, వాటిపై వెంటనే చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదుకు ముందు వైసీపీ నాయకులు, కార్యకర్తలు కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్