సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బొలెరో కిందకు దూసుకెళ్లడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.