సత్తెనపల్లి పట్టణం 19వ వార్డు సుందరయ్య కాలనీలో శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించారు. ఏప్రిల్ 1 నుంచి మగ్గాలకు 200, పవర్‌లూమ్ మగ్గాలకు 500 యూనిట్లు ఉచితం అవుతుందని ప్రకటించారు. కూటమి ప్రభుత్వ సంస్కరణలతో చేనేత రంగం అభివృద్ధి చెందుతోందని, 1.04 లక్షల కుటుంబాలు ఏటా రూ.8,640 నుంచి 21,600 వరకు ఆదా పొందతాయని తెలిపారు. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులు ఆర్థికంగా లబ్ధి పొందుతారని ఆయన పేర్కొన్నారు.