పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంగళవారం
జనసేన పార్టీ క్షేత్రస్థాయి బలోపేతం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నియోజకవర్గం మొత్తం కార్యకర్తలు, వివిధ పదవుల్లో ఉన్న
జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు. డొక్కాసీతమ్మ అన్న ప్రసాద వితరణ నిర్వాహకులు అప్పాపురపు నరేంద్ర కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.