శనివారం సత్తెనపల్లిలోని ప్రగతి కాలేజీ వద్ద ఓ లారీ అదుపుతప్పి కూరగాయల బండిపై దూసుకుపోయింది. స్థానికుల కథనం ప్రకారం, డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. లారీ ఢీకొనడంతో కూరగాయల బండి ధ్వంసమైనప్పటికీ, అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.